‘సంఝౌతా’ నిందితులంతా నిర్దోషులే


Thu,March 21, 2019 02:23 AM

Swami Aseemanand and 3 Others Acquitted In Samjhauta Blast Case

-2007 నాటి రైలు పేలుడు కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు
-స్వామి అసీమానంద్‌తోపాటు మరో ముగ్గురికి విముక్తి

పంచ్‌కుల: సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసు లో స్వామి అసీమానంద్‌తోపాటు మరో ము గ్గురిని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న నబ కుమార్ సర్కార్ అలియాస్ స్వామి అసీమానంద్, లోకేశ్ శర్మ, కమల్ చౌహాన్, రాజిందర్ చౌదరిని కోర్టు విడుదల చేసిందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తరఫు న్యాయవాది రాజన్ మల్హోత్రా చెప్పారు. భారత్-పాక్ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలులో 2007, ఫిబ్రవరి18న పేలుడు సంభవించిం ది. హర్యానాలోని పానీపట్‌కు రైలు సమీపించగానే సంభవించిన పేలుడులో 68 మంది మృతి చెందారు. పేలుడు ధాటికి ఒక బోగీ నిలువు నా 2 ముక్కలైంది. మృతుల్లో ఎక్కువమంది పాకిస్థానీలే. ఈ కేసులో తమ దేశ ప్రత్యక్ష సాక్షుల కథనాన్ని పరిశీలించాలన్న ఓ పాక్ మహిళ విజ్ఞప్తిని ఎన్‌ఐఏ ప్రత్యేక జడ్జి జగ్‌దీప్‌సింగ్ తోసిపుచ్చారు.

పేలుడు కేసును తొలుత హర్యానా పోలీసులు నమోదుచేసినా 2010 లో కేసు దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించారు. ఎన్‌ఐఏ 2011లో 8 మందికి వ్యతిరేకంగా చార్జిషీటు దాఖలు చేసింది. వీరిలో స్వామి అసీమానంద్, లోకేశ్ శర్మ, కమల్ చౌహాన్, రాజిందర్‌చౌదరి కోర్టు ముందు హాజరై విచారణనెదుర్కొన్నారు. రైలులో బాంబు పేలుడు కు ప్రధాన సూత్రధారి సునీల్ జోషి.. మధ్యప్రదేశ్‌లోని దేవస్ జిల్లాలో 2007 డిసెంబర్‌లో తన ఇంటివద్ద హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కాల్చి చం పారు. మరో ముగ్గురు నిందితులు రామచం ద్ర కల్‌సంగ్రా, సందీప్ డాంగే, అమిత్ పోలీసులకు చిక్కలేదు. దీంతో వారిని కోర్టు అపరాధులుగా ప్రకటించింది. స్వామి అసీమానంద్‌కు ఇప్పటికే బెయిల్ లభించగా, మరో ముగ్గురు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

పాక్ తీవ్ర నిరసన

సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసులో నిందితులందరూ నిర్దోషులుగా విడు దల కావడంపై పాక్ భారత న్యాయ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేసింది. కోర్టు తీర్పుపై తమ దేశంలోని భారత హైకమిషనర్‌ను పిలిపించి నిరసన వ్యక్తం చేసింది.

Jagmeet

కెనడా పార్లమెంట్‌కు భారత సంతతి వ్యక్తి

తొలి శ్వేతజాతీయేతరుడిగా రికార్డు
కెనడా పార్లమెంట్‌లో భారత సంతతికి చెందిన జగ్మీత్‌సింగ్ చరిత్ర నెలకొల్పారు. దేశంలోని ప్రధాన ప్రతిపక్షం నుంచి కామన్స్ హౌస్‌కు తొలిసారి ఎన్నికైన శ్వేతజాతీయేతరుడిగా రికార్డు సృష్టించారు. తలపాగా ధరించి సోమవారం సభకు హాజరైన జగ్మీత్ సింగ్‌కు సభ్యులంతా చప్పట్లతో స్వాగతం పలికారు. న్యూ డెమొక్రటిక్ పార్టీ తరఫున జగ్మీత్ సింగ్ గత నెల 25న జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్నికయ్యారు. పార్లమెంట్‌కు వచ్చిన సందర్భంగా జగ్మీత్ సింగ్ స్పందిస్తూ న్యూజిలాండ్‌లో మసీదులపై జరిగిన దాడిలో నష్టపోయిన ముస్లిం కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. దాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు.

560
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles