ఈబీసీ రిజర్వేషన్లపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

Tue,February 12, 2019 02:20 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ నిర్వహించింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలంటూ కేంద్రానికి న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈబీసీ రిజర్వేషన్లలో ఏపీ ప్రభుత్వం కాపులకు 5 శాతం ఇస్తున్నదని, ఈబీసీ రిజర్వేషన్లు కులాల ప్రాతిపదికన కాదంటూ కృష్ణయ్య కోర్టులో కేసు వేశారు.

264
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles