డిజిటల్ యుగంలో న్యాయ వ్యవస్థపై ఒత్తిడి


Mon,February 11, 2019 01:18 AM

Supreme Court judge Justice Sikri worried

-విచారణ ప్రారంభం కాకముందే తీర్పుపై సామాజిక మాధ్యమాల్లో చర్చ
-సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిక్రీ ఆవేదన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ప్రస్తుత డిజిటల్ యుగంలో న్యాయ వ్యవస్థ విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ ఆవేదన వ్యక్తం చేశారు. కేసును న్యాయస్థానం విచారణకు స్వీకరించకముందే ఆ కేసులో తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై ప్రజలు సామాజిక మాధ్యమాల్లో చర్చిస్తున్నారని, ఇది న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్నదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఆదివారం లావాసియా (లా అసోసియేషన్ ఫర్ ఆసియా అండ్ ది పసిఫిక్) ఏర్పాటు చేసిన సదస్సులో డిజిటల్ యుగంలో పత్రికా స్వేచ్ఛ అనే అంశంపై జస్టిస్ సిక్రీ మాట్లాడారు. పౌరహక్కులు, మానవ హక్కుల స్వరూప స్వభావాలను పత్రికా స్వేచ్ఛ మార్చివేస్తున్నదని, ప్రస్తుతం మీడియా జరుపుతున్న విచారణలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మీడియా విచారణలు గతంలోనూ ఉండేవని, అయితే నేడు ఏదైనా అంశంపై దాఖలైన వ్యాజ్యాన్ని న్యాయస్థానం కనీసం విచారణకు కూడా స్వీకరించకముందే ఆ పిటిషన్‌పై తీర్పు ఎలా ఉంటుంది? ఎలా ఉండాలి? అనే దానిపై ప్రజలు సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలుపెడుతున్నారని అన్నారు.

342
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles