చనిపోయేలోగా బయోపిక్ చూడాలనుకున్నా..


Fri,July 12, 2019 02:06 AM

Super 30 Celeb Review Hrithik Roshan Is Beyond Outstanding As Anand Kumar

- బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నా
- సూపర్ 30 రియల్ హీరో ఆనంద్ కుమార్ వెల్లడి


ముంబై: బీహార్‌కు చెందిన ప్రముఖ గణితవేత్త ఆనంద్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు. కొంత కాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న తాను, చనిపోయేలోగా తన బయోపిక్‌ను చూడాలనుకున్నానన్నారు. నేను 2014 నుంచి ఎకూస్టిక్ న్యూరోమా అనే బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నాను. దీంతో నా కుడి చెవి పూర్తిగా పని చేయడం లేదు. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా దవాఖాన డాక్టర్లు పలు వైద్య పరీక్షలు చేసి చెవి నుంచి మెదడుకు వెళ్లే ప్రధాన నరం వద్ద ఓ కణతి ఉందని తెలియజేశారు. ఇప్పుడు నేను కొన్ని మందులు వాడుతున్నాను. చావు పుట్టుకలు మన చేతిలో ఉండవు. అందుకే నేను చనిపోయేలోగా నా బయోపిక్ చూడాలనుకున్నా అని ఆనంద్ చెప్పారు. బీహార్‌లో సూపర్ 30 పేరుతో ఐఐటీ శిక్షణ సంస్థ ప్రారంభించిన ఆనం ద్, ప్రతి ఏటా 30 మంది ప్రతిభా వంతులైన పేదలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఐఐటీ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దుతున్నారు. ఆయన జీవితం ఆధారంగా రూపొందించిన సూపర్ 30 అనే సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆనంద్ పాత్రలో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ నటించారు.

3321
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles