సునందా పుష్కర్ మృతి కేసు బదిలీ


Fri,May 25, 2018 01:12 AM

Sunanda Pushkar Death Case Transferred To Fast-Track Court

న్యూఢిల్లీ, మే 24: సంచలనం సృష్టించిన సునం దా పుష్కర్ మృతి కేసు చట్టసభ సభ్యులను విచారించే ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యింది. ప్రస్తు తం ఈ కేసును ఢిల్లీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు విచారిస్తున్నది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునందా పుష్కర్ 2014లో ఢిల్లీలోని ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు శశిథరూర్‌పై కేసు నమోదు చేశారు. ఈ నెల 28 నుంచి ప్రత్యేక కోర్టు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ విశాల్ విచారణ ప్రారంభించనున్నారు.
sunanda

675
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles