ఏపీ మాజీ మంత్రి నారాయణపై దాడి

Thu,December 5, 2019 01:52 AM

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణపై విద్యార్థి సంఘాల నేతలు దాడిచేశారు. నారాయణ అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. నారాయణ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆయనను నిలదీశారు. ఈ సందర్భంగా నారాయణ అనుచరులకు, విద్యార్థి నాయకులకు మధ్య తోపులాట జరిగింది. నారాయణ అంగీ చిరిగిపోగా, ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి.

193
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles