బంకుల్లో కార్డులపై భారం ఉండదు

Tue,January 10, 2017 02:19 AM

డిజిటల్ చార్జీ ఎవరు భరిస్తారో త్వరలో తేలుతుంది
కార్డుల వినియోగాన్ని కొనసాగించవచ్చు
పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ

న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: పెట్రోల్ బంకుల్లో క్రెడిట్, డెబిట్ కార్డుల వాడకంపై ఎలాంటి పన్ను లేదా సర్‌చార్జి వసూలు చేయబోమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. కార్డు లావాదేవీల ద్వారా విధించే పన్ను/సర్‌చార్జి అంశం బ్యాంకులకు, పెట్రోలియం సంస్థలకు సంబంధించిన వ్యవహారమని, దీనితో వినియోగదారులకు సంబం ధం లేదని చెప్పారు. జనవరి 13 వరకే కాకుండా ఆ తర్వాత కూడా ఇది వర్తిస్తుందని తేల్చి చెప్పారు. కార్డుల లావాదేవీలపై ఆర్బీఐ నిబంధన ప్రకారం ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జి మాత్రం ఉంటుందని, అయితే దీన్ని బ్యాంకులు భరిస్తాయా లేక పెట్రోలియం సంస్థలు భరిస్తాయా? అనేదానిపై నాలుగైదు రోజుల్లోనే స్పష్టత వస్తుందని అన్నారు. పెట్రోలు బంకుల్లో జరిగే డిజిటల్ లావాదేవీల్లో వినియోగదారులపై సర్‌చార్జి విధిస్తారని, బంకులు కూడా ఆ భారం వహించాల్సి ఉంటుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తమపై భారం పడిన పక్షంలో కార్డులద్వారా లావాదేవీలను నిలిపివేస్తామ ని బంకుల యాజమాన్యాలు హెచ్చరించా యి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సోమవారం ఉదయం ధర్మేంద్ర ప్రధాన్ మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారంతో వినియోగదారుడికి ఎలాంటి సంబంధం లేనందున కార్డులను నిరభ్యంతరంగా వాడుకోవచ్చునని, వారిపై ఎలాంటి అదనపు భారం పడదని వివరణ ఇచ్చారు.
darm
వినియోగదారులపై డిజిటల్ పన్ను భారం ఉండకపోగా, వారికి ముందుగానే ప్రకటించినట్లుగా 0.75% మేర రాయితీ కూడా లభిస్తుందని నొక్కిచెప్పారు. పెట్రోలు బంకులు కమీషన్ ఏజెంట్లుగా మాత్రమే వ్యవహరిస్తున్నాయని, వాటిపై కూడా కార్డు లావాదేవీల ద్వారా పెట్రోలు బంకుల ఆందోళన గురించి కేంద్ర ఆర్థిక మంత్రితో తాను చర్చించానని ప్రధాన్ చెప్పారు. ప్రస్తుతం బ్యాంకులు, పెట్రోలియం సంస్థల యాజమాన్యంతో చర్చలు జరుగుతున్నాయని, రిజర్వుబ్యాంకు నిబంధన ప్రకారం పన్ను ఎవరి పరిధిలోకి వస్తుందో నాలుగైదు రోజుల్లో తేలిపోతుందని అన్నారు. గత సంవత్సరం ఫిబ్రవరిలోనే పెట్రోలు బంకుల్లో డిజిటల్ లావాదేవీలపై కేంద్రం చర్చించి వినియోగదారులపై ఎండీఆర్ భారం పడకూడదని నిర్ణయం తీసుకుని సర్క్యులర్ కూడా జారీ చేసిందని తెలిపారు. ఇప్పటికీ కేంద్రం అదే విధానానికి కట్టుబడి ఉన్నదని, పైగా డిజిటల్ లావాదేవీలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నందున వినియోగదారులపై అదనపు పన్ను భారాన్ని మోపే సమస్యే లేదని స్పష్టం చేశారు. ఎండీఆర్ పన్నులో పెట్రోలియం సంస్థలు, బ్యాంకులతో పాటు పేమెంట్ గేట్ వే సంస్థలు, పీవోఎస్ (పాయింట్ ఆఫ్ సేల్స్)లను నిర్వహించే సంస్థలు, మర్కండైజ్ ఔట్‌లెట్ తదితర రంగాలు ఉన్నాయని, ఛార్జిలను ఈ సంస్థలన్నీ పొందుతున్నందువల్ల వీటన్నింటితో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఒక స్పష్టమైన విధాన నిర్ణయాన్ని తీసుకుంటుందని చెప్పారు.

350

More News

మరిన్ని వార్తలు...