66 ఏండ్లుగా పెంచిన గోర్లకు త్వరలో విముక్తి


Thu,July 12, 2018 07:06 AM

sridhar chillal to cut his fingernails after 66 years

న్యూయార్క్ వేదికగా కత్తిరించనున్న పుణె వాసి
న్యూయార్క్, జూలై 11: ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న తన గోర్లకు త్వరలో కత్తిరింపు ఉత్సవాన్ని నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాడు ఓ వ్యక్తి. పుణెకు చెందిన శ్రీధర్ చిల్లాల్ గత 66 ఏండ్లుగా తన ఎడమ చేతి గోర్లు పెంచుతున్నాడు. ఈ గోర్లే ప్రపంచంలో అత్యంత పొడవైనవిగా గుర్తింపునకు నోచుకుని.. 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకున్నాయి. ప్రస్తుతం 82 ఏండ్ల వయసున్న శ్రీధర్ చిల్లాల్.. 1952 నుంచి కత్తిరించకుండా గోర్లను పెంచుతున్నాడు. 66 ఏండ్ల తర్వాత తన పొడవాటి గోర్లను కత్తిరించుకోవాలని చిల్లాల్ నిర్ణయించుకున్నాడు. గోర్ల కత్తిరింపు ఉత్సవాన్ని నిర్వహించేందుకు చిల్లాల్ ఇటీవల న్యూయార్క్ వచ్చారు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనే కార్యక్రమం వేదికగా తన గోర్లను కత్తిరించనున్నారు. న్యూయార్క్ టైమ్స్ స్కేర్‌లోని మ్యూజియంలో గోర్ల కత్తిరింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. చిల్లాల్ మొత్తం గోర్ల పొడవు 900 సెంటీమీటర్లుగా నమోదు కాగా.. చూపుడు వేలుకున్న గోరు 197.8 సెంటీమీటర్ల పొడవుంది. కత్తిరించిన తర్వాత ఈ గోర్లను న్యూయార్క్‌లోని బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియంలో భద్రపరచనున్నారు.

2192
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS