కమనీయం నగదు రహిత వివాహం!Wed,January 11, 2017 01:37 AM

checks
జంషెడ్‌పూర్, జనవరి 10: మేళతాళాలు, హంగుఆర్భాటాలను పక్కన పెడితే పెండ్లిలో నగదు రూపంలో కట్న కానుకలే ప్రధానాంశం. ఇలాంటి సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ విభిన్న తరహాలో నగదు రహిత వివాహం ప్రత్యేకతను సంతరించుకున్నది. పెండ్లికి వచ్చిన వారంతా చెక్కుల రూపంలోనే కానుకలు సమర్పించారు. కూరగాయల కొనుగోలు, టెంట్ హౌస్ సామ గ్రి, ఆభరణాలు, తదితర వస్తువులన్ని నగదు రహిత విధానంలోనే తెచ్చారు.

చివరికి పెండ్లితంతును నిర్వహించిన పురోహితుడికి దక్షిణ కూడా చెక్కు రూపంలోనే ఇచ్చారు. ఈ తరహా విశేషాలున్న పెండ్లి సోమవారం తెల్లవారుజామున జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భమ్ జిల్లాలోని బడియాలోని ఓ ఆలయంలో జరిగింది. బడియా గ్రామానికి చెందిన సుభాష్‌నాయక్, చక్రధర్‌పూర్‌నకు చెందిన సునీతతో పెండ్లి జరిపించారు. పెండ్లికి ముందు గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి కానుకగా పెండ్లి కూతురుకు మరుగుదొడ్డిని కొన్నిగంటల్లోనే కట్టి ఇవ్వడం మరో విశేషం. నగదు రహితంగా పెండ్లి జరిగేలా రెండు కుటుంబాలను పెండ్లి కుమారుడు ఒప్పించాడని జిల్లా డిపూటీ కలెక్టర్ సంజయ్‌కుమార్ తెలిపారు. వివాహానికి ఘాట్‌సిలా బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ తుడు, ముసబోని సర్కిల్ ఆఫీసర్, డీఎస్పీ తదితర ప్రముఖులు హాజరై చెక్కుల ద్వారా కానుకలను అందించారు. జాయింట్ అకౌంట్‌ను ఓపెన్ చేసి ఏటీఎం కార్డును నూతన దంపతులకు బ్యాంకు మేనేజర్ అందించారు.

320
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS