రైలు ప్రయాణికులకు మదద్Mon,April 16, 2018 02:15 AM

-త్వరలో రైల్వే శాఖ మొబైల్ యాప్
RAILWAYS
న్యూఢిల్లీ: ప్రయాణికుల సమస్యల పరిష్కారాని కి ఇప్పటికే పలు రకాల సేవలను అందుబాటులోకి తెచ్చిన రైల్వే శాఖ త్వరలో మొబైల్ సేవలనూ ప్రారంభించనుంది. ఈ మొబైల్ యాప్‌కు మదద్ అని పేరు పెట్టింది. ప్రయాణ సమయం లో తమకు అందించిన ఆహారం బాగాలేకున్నా, రైలులో మరుగుదొడ్లు శుభ్రంగా లేకున్నా వెంటనే ప్రయాణికుడు ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అత్యవసర సేవలకూ ఈ యాప్‌ను వినియోగించవచ్చు. ఈ యాప్ ద్వారా చేసిన ఫిర్యాదులు నేరుగా సంబంధిత అధికారులు చేరడంతో వాళ్లు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ప్రయాణికుడు తన ఫిర్యాదు ఏ స్థాయిలో ఉన్నది.. అధికారులు తీ సుకున్న చర్యలేమిటి అన్న విషయాలను కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి ఇప్పటి వరకు 14 రకాల సేవలను అమ లు చేస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి.

345

More News

VIRAL NEWS