నాడు పీవీకి అవమానం.. నేడు ధావన్‌కు గౌరవం


Fri,August 10, 2018 02:38 AM

Sonia pays tributes to Dhawan at AICC HQ

కాంగ్రెస్ నాయకత్వ తీరుపై నెటిజన్ల విమర్శలు
న్యూఢిల్లీ: గత మంగళవారం కన్నుమూసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్కే ధావన్ మృతదేహాన్ని ఏఐసీసీ కార్యాయలానికి తీసుకురావడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధావన్‌ను గౌరవించిన కాంగ్రెస్ నాయకత్వం నాడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విషయంలో మాత్రం అవమానకరంగా వ్యవహరించిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ధావన్ మృతదేహానికి బుధవారం ఢిల్లీలోని లోధీ దహన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఆయన పార్థివ దేహాన్ని ఏఐసీసీ కార్యాలయంలో కొద్దిసేపు ఉంచారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీకి చెందిన ఇతర నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. ఐతే గతంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణించినప్పుడు ఆయన పార్థివ దేహాన్ని ఏఐసీసీ కార్యాలయంలో ఉంచేందుకు అప్పటి కాంగ్రెస్ నాయకత్వం నిరాకరించింది.
పార్టీకి సుదీర్ఘకాలం సేవ చేయడమేకాకుండా ప్రధాని పదవిని సైతం అధిష్టించిన వ్యక్తి పార్థివ దేహాన్ని పార్టీ ప్రధాన కార్యాలయానికి తీసుకురాకుండా నాటి నాయకత్వం అవమానించిందని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. తాజాగా ధావన్ మృతదేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తీసుకురావడంపై నెటిజన్లు పీవీ విషయాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు సంధిస్తున్నారు. మాజీ ప్రధానుల సమాధులకు ఢిల్లీలో స్థలం కేటాయించిన ప్రభుత్వం పీవీకి మాత్రం నిరాకరించడాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు.

390
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS