పోలీసుల కస్టడీలో గౌరీ లంకేశ్ హంతకుడు


Wed,June 13, 2018 03:09 AM

Sixth suspect arrested in Gauri Lankesh murder

మహారాష్ట్రలో అదుపులోకి తీసుకున్న అధికారులు
SIT
బెంగళూరు: జర్నలిస్టు గౌరీ లంకేశ్‌పై కాల్పులు జరిపినట్లుగా అనుమానిస్తున్న ఒక వ్యక్తిని సోమవారం అరెస్ట్ చేశామని కర్ణాటక పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తెలిపింది. అతడిని మహారాష్ట్రలో అరెస్ట్ చేశామని సిట్ వర్గాలు చెప్పాయి. ఎక్కడ అరెస్ట్ చేశామన్న విషయం బహిరత్గానికి ఆ వర్గాలు నిరాకరించాయి. మేము అతడ్ని ప్రశ్నించిన తర్వాతే వివరాలు వెల్లడిస్తాం అని సిట్ అధికారి ఒకరు చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొంటున్న నాలుగు సిట్ బృందాల్లో ఒక బృందం మహారాష్ట్రలో 30 ఏండ్లు దాటిన మరాఠీ వ్యక్తిని అరెస్ట్ చేసిందన్నారు. గౌరీ లంకేశ్ హత్య తాలూకు సీసీటీవీ ఫుటేజీ చిత్రాల ఆధారంగా గీసిన ఊహాచిత్రాలతో శ్రీరంగపట్నం వాసి, నిందితుడు కేటీ నవీన్ కుమార్ స్నేహితుడు అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గౌరి హత్య కేసులో నిందితులకు అవసరమైన సమాచారాన్ని అనిల్ కుమార్ అందజేశాడు. అనిల్ కుమార్‌ను సిట్ స్థానిక న్యాయస్థానం ముందు హాజరు పరిచింది.

557

More News

VIRAL NEWS