ఉసురుతీసిన నిమజ్జనం ఆట!


Wed,September 11, 2019 02:05 AM

Six Children Feared Dead after Drowning During Ganesha Idol Immersion in Karnatakas Kolar

- నీటికుంటలో మునిగి ఆరుగురు చిన్నారుల దుర్మరణం.. కర్ణాటకలో విషాదం

బెంగళూరు, సెప్టెంబర్ 10: ఆటలో భాగంగా తయారు చేసిన వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు పిల్లలు మృతి చెందారు. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. మొహర్రం నేపథ్యంలో మంగళవారం పాఠశాలకు సెలవు కావడంతో మరడగుట్ట గ్రామానికి చెందిన కొందరు పిల్లలు స్థానికంగా ఉన్న ఒక నీటికుంట వద్ద ఆటలు ఆడుకున్నారు. మట్టితో వినాయకుడి విగ్రహం తయారుచేసి పూజలు చేశారు. అనంతరం విగ్రహాన్ని నీటికుంటలో నిమజ్జనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ముగ్గురు పిల్లలు కుంటలో పడిపోయారు. వాళ్లను కాపాడుదామని ప్రయత్నించిన మరో ముగ్గురు బాలలు కూడా నీటిలో మునిగిపోయారు. గమనించిన గ్రామస్థులు పిల్లల్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. ముగ్గురు చిన్నారులు సంఘటన స్థలంలోనే మరణించగా, మరో ముగ్గురు దవాఖానకు తరలిస్తుండగా చనిపోయారు. బాధిత తల్లిదండ్రుల శోకంతో ఆ గ్రామంలో విషాదం నెలకొన్నది.

516
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles