ఆడియో రికార్డుల వివాదం పై సిట్


Tue,February 12, 2019 02:32 AM

SIT to probe controversial Karnataka audio clip

-అసెంబ్లీలో కర్ణాటక సీఎం కుమారస్వామి వెల్లడి
-స్పీకర్ రమేశ్‌కుమార్ సూచన మేరకు నిర్ణయం

బెంగళూరు, ఫిబ్రవరి 11: అధికార జేడీఎస్ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీఎస్ యెడ్యూరప్ప జరిపిన సంభాషణల ఆడియో రికార్డుల వివాదంపై సమగ్ర దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం హెచ్‌డీ కుమారస్వామి ప్రకటించారు. ఈ వివాదంలోకి తన పేరు రావడంతో నిజానిజాలను బయటపెట్టేందుకు సిట్ దర్యాప్తునకు ఆదేశించాలని సోమవారం అసెంబ్లీలో స్పీకర్ రమేశ్‌కుమార్.. సీఎం కుమారస్వామికి సూచించారు. నిజాలను వెలికి తీసేందుకు సిట్‌ను ఏర్పాటు చేయండి. 15 రోజుల్లో నాకు ఉపశమనం కలిగించండి అని సీఎంకు సూచించారు. దీనిపై కమారస్వామి స్పందిస్తూ స్పీకర్‌పై అభియోగాలు రావడం బాధాకరమన్నారు. సిట్‌ను ఏర్పాటు చేయాలన్న ఆయన సూచనను ఆమోదిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ సభ్యులు స్పందిస్తూ.. సిట్ దర్యాప్తు కేవలం స్పీకర్‌కు సంబంధించిన అంశానికి పరిమితం కావాలని, లేకపోతే ప్రభుత్వంపై విశ్వాసం ఉండదని వ్యాఖ్యానించారు. దీనిపై స్పీకర్ ప్రతిస్పందిస్తూ సిట్ ఏర్పాటు వేధింపులకు దారి తీయరాదని చెప్పారు.

354
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles