కేజ్రీవాల్‌ను చూసి ఓటేయండి

Wed,January 11, 2017 12:48 AM

మొహాలి ర్యాలీలో ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా పిలుపు
మొహాలి, జనవరి 10: ఆప్ పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్‌ను దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని ప్రజలను ఆ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌సిసోడియా కోరారు. మంగళవారం మొహాలిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ఇక్కడ విషయం కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం కేజ్రీవాల్ బాధ్యత అని పేర్కొన్నారు. దీనిపై మనీశ్ సిసోడియాను విలేకరులు ప్రశ్నించగా నన్నెందుకు అడుగుతున్నారు. ఎన్నికైన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని నిర్ణయిస్తారు అని పేర్కొన్నారు. డ్రగ్స్, అవినీతి నుంచి పంజాబ్ రాష్ర్టాన్ని ఎవరైతే విముక్తం చేయగలరో వారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. అరవింద్ కేజ్రివాల్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేర్కొంటూ పంజాబ్ ప్రజలను ఓట్లు అడగడం ద్వారా తమ ప్రణాళికలను మనిశ్‌సిసోడియా బయట పెట్టారని అకాలీదళ్ సీనియర్ నేత, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌సింగ్ ట్విటర్‌లో పేర్కొన్నారు. కేజ్రీవాల్ తన దుర్మార్గపు ఆలోచనలను బయట పెట్టారని పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అమరీందర్‌సింగ్ ట్వీట్ చేశారు.

215

More News

మరిన్ని వార్తలు...