మత్తుపదార్థాల వినియోగం నేరం కాదు రోగం


Fri,August 10, 2018 02:33 AM

Sikkim will decriminalise drug use

-డ్రగ్స్ సరఫరాదారులకు మరింత కఠిన శిక్షలు
-సిక్కిం సీఎం పవన్ చామ్లింగ్ వెల్లడి

గ్యాంగ్‌టక్: నిషేధిత మత్తుపదార్థాల వినియోగం నేరం కాదని.. దానిని చికిత్స అవసరమైన వ్యాధిగా గుర్తిస్తామని సిక్కిం సీఎం పవన్‌కుమార్ చామ్లింగ్ తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేసేవారికి మరింత కఠిన శిక్షలు విధించేలా ప్రస్తుత చట్టాలను సవరిస్తామని బుధవారం రాణీపూల్‌లో జరిగిన టెండోంగ్ లో అనే గిరిజన వేడుకలో మీడియాకు తెలిపారు. మత్తుపదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. మత్తుపదార్థాలకు బానిసలుగా మారిన యువత చికిత్స చేయించుకునేందుకు ముందుకురావాలని సూచించారు. మత్తుపదార్థాల వ్యసనాన్ని అధిగమించేలా సిక్కిం యువతకు అవగాహన కల్పించేందుకు నటుడు సంజయ్‌దత్‌ను సిక్కింకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కాగా సిక్కింలో డ్రగ్స్‌ను వినియోగిస్తూ పట్టుబడ్డ నిందితులకు ఆరునెలల జైలు, రూ.20వేల జరిమానా విధిస్తారు.

407
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles