పంజాబ్ మంత్రి సిద్ధూకు ఊరటWed,May 16, 2018 02:04 AM

-పాటియాలా కేసులో నిర్దోషిగా ప్రకటించిన సుప్రీంకోర్టు
-రూ.1000 జరిమానా, జైలుశిక్ష నుంచి విముక్తి
Sidhu
న్యూఢిల్లీ, మే 15: హత్యానేరం కేసులో పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గుర్నాంసింగ్ అనే వ్యక్తిని సిద్ధూ ఉద్దేశపూర్వకంగా గాయపర్చడాన్ని చిన్న నేరంగా పరిగణిస్తున్నట్లు జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. సిద్ధూకు రూ.1000 జరిమానా విధించింది. జైలుశిక్ష నుంచి తప్పించింది. సిద్ధూ స్నేహితుడు రూపిందర్ సింగ్ సంధూను కూడా నిర్దోషిగా ప్రకటించింది. సిద్ధూ, ఆయన స్నేహితుడు సంధూ 1998 డిసెంబర్ 27న పాటియాలా రోడ్డు మధ్యలో వాహనం జిప్సీని నిలిపారు. రోడ్డు మధ్యలో నిలిపిన జిప్సీని తప్పించాలని గుర్నాంసింగ్ కోరడంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. సిద్ధూ, సంధూ ఆగ్రహంతో గుర్నాంసింగ్‌పై దాడి చేసి కొట్టారు. గుర్నాంసింగ్‌ను దవాఖానకు తరలించగా, అప్పటికే మరణించాడని వైద్యులు ప్రకటించారు. దీంతో సిద్ధూ, సంధూలపై పోలీసులు ఐపీసీ 323 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

484

More News

VIRAL NEWS