రూపాయికే వైద్య పరీక్షలు

Sun,October 13, 2019 02:25 AM

-రూ.10కే భోజనం, పేద రైతులకు ఏడాదికి రూ.10వేలు
-శివసేన హామీలు; మేనిఫెస్టో విడుదల
ముంబై: రాష్ట్రవ్యాప్తంగా రూ.10కే ఆరోగ్యకరమైన భోజనాన్ని అందజేస్తామని, ఒక్క రూపాయికే ఆరోగ్య పరీక్షలు అందుబాటులోకి తీసుకొస్తామని శివసేన హామీ ఇచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 300 యూనిట్లలోపు కరెంటును వినియోగించే వారి బిల్లును 30శాతం తగ్గిస్తామని శివసేన హామీనిచ్చింది. పేద రైతులకు ఏడాదికి రూ.10,000 చొప్పున నగదు బదిలీ చేస్తామని పేర్కొంది. 10, 12వ తరగతి చదివే విద్యార్థులు మరాఠీ భాషలో 80 శాతానికిపైగా మార్కులు సాధిస్తే ప్రత్యేక స్కాలర్‌షిప్‌లను అందజేస్తామని ప్రకటించింది. ముంబై మెట్రో రైలు కార్పొరేషన్ అవసరాల నిమిత్తం ఆరే మిల్క్ కాలనీలో భారీగా చెట్ల నరికివేతను తాము వ్యతిరేకిస్తున్నామని మేనిఫెస్టోలో శివసేన వెల్లడించింది.

150
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles