వారిద్దరు చాలా కష్టపడ్డారు


Wed,May 22, 2019 01:42 AM

Shiv Sena also praised Congress chief Rahul Gandhi and party general secretary Priyanka Gandhi

- రాహుల్, ప్రియాంకకు శివసేన ప్రశంస

ముంబై: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం రాహుల్, ప్రియాంక చాలా కష్టపడ్డారని బీజేపీ మిత్రపక్షమైన శివసేన ప్రశంసించింది. ఈసారి కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా అవతరించేందుకు అవసరమైన సంఖ్యను చేరుకొంటుందని, రాహుల్‌కు ప్రతిపక్ష నేత హోదా దక్కడం ఖాయమని శివసేన తన అధికార పత్రిక సామ్నాలో ఒక కథనాన్ని ప్రచురించింది. కేంద్రంలో మరోసారి నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుం దని ధీమా వ్యక్తంచేసింది. ఎగ్జిట్‌పోల్స్ ఏం చెప్పాయనే విషయం మాకు అనవసరం. ప్రజల ఉత్సాహం చూస్తుంటే మోదీ సారథ్యంలో ఎన్డీఏ రెండోసారి కేంద్రంలో అధికారపీఠం ఎక్కనున్నదనే నమ్మకం కలుగుతున్నది. అలాగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకావాద్ర కష్టించి పనిచేశారు.

వారి శ్రమకు తగిన ఫలితాన్ని తప్పక అందుకొంటారు. ఈసారి పార్లమెంటులో కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా ఉండేందుకు కావాల్సిన స్థానాలను సొంతం చేసుకుంటుందనడంలో ఎలాంటి సందేహంలేదు. అలాగే రాహుల్‌గాంధీ ఈసారి ప్రతిపక్ష నేత హోదా పొందుతారు. దీన్ని రాహుల్ విజయంగానే చెప్పుకోవాలి అని తన కథనంలో శివసేన తెలిపింది. సంపాదకీయంలో కూడా రాహుల్, ప్రియాంకపై ప్రశంసించింది. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీసగఢ్‌లతోపాటు పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తన ఆధిక్యత ప్రదర్శించడం ఖాయమని అభిప్రాయపడింది.

538
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles