నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు!


Tue,July 17, 2018 05:14 AM

Shashi Tharoor office vandalized over Hindu Pakistan rem Cong MP says assault on democracy

-కేరళలోని నా కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు
-కాంగ్రెస్ నేత శశిథరూర్ వెల్లడి

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే దేశం హిందూ పాకిస్థాన్‌గా మారుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వారంక్రితం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తాజాగా అగ్గి రాజేశాయి. బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు తనను చంపుతామని బెదిరిస్తున్నారని, తిరువనంతపురంలోని తన కార్యాలయంలో విధ్వంసం సృష్టించారని సోమవారం వరుస ట్వీట్లలో శశిథరూర్ పేర్కొన్నారు. ఇంకా కిరాతక చర్యలకు పాల్పడుతున్నారు. నన్ను చంపుతామని బెదిరిస్తున్నారు. నా ఎంపీ కార్యాలయాలన్ని మూసివేయాలని చూస్తున్నారు. ఇది భావప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే. ఈ అంశాన్ని కేరళ పోలీసుల దృష్టికి తీసుకెళ్తాం అని పేర్కొన్నారు. తిరువనంతపురంలోని నా నియోజకవర్గ కార్యాలయంపై బీజేపీ యువమోర్చా కార్యకర్తలు దాడిచేశారు. సైన్‌బోర్డులు, గోడలు, గేట్లపై నల్లరంగు పూశారు. నాకు ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలను గెంటివేశారు. నేను పాకిస్థాన్ వెళ్లాలని నినాదాలు చేయడంతోపాటు నాకు వ్యతిరేకంగా బ్యానర్లు కట్టారు అని థరూర్ తెలిపారు. అయితే, ఆ దాడి సమయంలో థరూర్ అక్కడ లేరు.

937
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles