ఎస్‌ఎఫ్‌ఐ ర్యాలీ హింసాత్మకం


Sat,September 14, 2019 02:22 AM

SFI, DYFI rally for employment in West Bengal

- యువతకు ఉద్యోగాలు కల్పించాలని బెంగాల్‌లో భారీ నిరసన
- పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు


హౌరా, సెప్టెంబర్ 13: రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమబెంగాల్‌లోని సీపీఎం విద్యార్థి యువజన సంఘాలు, కార్యకర్తలు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడం.. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువును, నీటి గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు, నిరసనకారులు గాయపడ్డారు. సీపీఎం విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ, యువజన సంఘం డీవైఎఫ్‌ఐ నాయకులు గురువారం సింగూరు నుంచి కోల్‌కతాలో ఉన్న రాష్ట్ర సచివాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అయితే వీరి ర్యాలీ హౌరాలోని మల్లిక్ ఘాట్ చేరుకునే సరికి పోలీసులు అడ్డుకున్నారు. తొలుత ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా నిరసనకారులు పోలీసులపై రాళ్లు, ఇటుకపెళ్లలు రువ్వడంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీచార్జి చేసి జల ఫిరంగులను ప్రయోగించారు. ఇరువర్గాల మధ్య జరిగిన డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి సయన్‌దీప్ మిత్రా మాట్లాడుతూ శాంతియుతంగా నిర్వహిస్తున్న మా ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అధికారులకు వినతిపత్రం సమర్పించడానికి మా ప్రతినిధుల్లో కనీసం ఐదుగురిని అనుమతించాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు అని తెలిపారు. సింగూరులో నేలమట్టమైన పరిశ్రమల శిథిలాలపై మమతాబెనర్జీ ప్రభు త్వం కొలువుదీరిందని విమర్శించారు. పెట్టుబడులకు ఎవరూ ముందుకు రాకపోవడంతో నిరుద్యోగం విపరీతంగా పెరిగిందన్నారు.

160
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles