సెజ్ భూములపై కేంద్రం, రాష్ర్టాలకు సుప్రీం నోటీసులుTue,January 10, 2017 01:16 AM

న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లకు ఇచ్చిన భూముల్లో చాలామటుకు నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని రైతులకు తిరిగిచ్చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన కార్పొరేట్ లబ్ధిదారులపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌కు సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ సుప్రీం కోర్టు అటు కేంద్రానికి, ఏడు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖెహర్, న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వర రావుతో కూడిన ధర్మాసనం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ర్టాలకు నోటీసు జారీ చేసింది. సెజ్‌ల కోసం సేకరించిన భూముల్లో దాదాపు 80 శాతం నిరుపయోగంగా ఉన్నాయని సెజ్ ఫార్మర్స్ ప్రొటెక్షన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది.

308
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS