మహిళా రోగులపై లైంగిక వేధింపులుFri,January 19, 2018 12:34 AM

బ్రిటన్‌లో భారత సంతతి వైద్యుడికి జైలు
లండన్, జనవరి 18: మహిళా రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు బ్రిటన్‌లోని భారత సంతతి వైద్యుడు జైలుపాలయ్యాడు. నలుగురు మహిళల్ని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు రావడంతో 60ఏండ్ల వయసున్న జశ్వంత్ రాథోడ్‌కు న్యాయస్థానం 15 ఏండ్ల జైలుశిక్షను విధించింది. జశ్వంత్‌రాథోడ్.. మూడేండ్ల వయసులో ఉన్నప్పుడు ఆయన కుటుంబం బ్రిటన్‌కు వలసవెళ్లింది. డుడ్లీలో క్యాజిల్ మెడోస్ సర్జరీ పేరుతో వైద్యశాలను రాథోడ్ నడుపుతున్నాడు. 2008-15 మధ్యకాలంలో రాథోడ్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ 20-30 మధ్య వయస్కులైన నలుగురు మహిళలు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మసాజ్ పేరుతో శరీరభాగాలను తడమడంతోపాటు పలు అసభ్య చేష్టలు చేసేవాడని వారు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. లైంగిక వేధింపులుగా కేసు నమోదు కాగా, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ మైఖేల్ థర్‌గుడ్ దర్యాప్తు చేశారు. ఏడువారాల విచారణ తర్వాత వాల్వర్‌హాంప్టన్ కోర్టు రాథోడ్‌ను దోషిగా తేల్చింది. వైద్యులపై రోగుల నమ్మకాన్ని ఆయన వమ్ముచేశాడని, వైద్య వృత్తికి కళంకం తెచ్చాడని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీనిని మోసపూరిత చికిత్సగా పేర్కొంటూ జైలుశిక్ష విధించింది. ఆయనపై మహిళారోగులు పెట్టిన మరో 8 కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.

143

More News

VIRAL NEWS