బాలికలపై కొనసాగుతున్న లైంగికదాడులుSat,April 21, 2018 12:30 AM

-ఉత్తర్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు చిన్నారులపై అఘాయిత్యం, హత్య
రాయ్‌పూర్/ లక్నో: కతువా వంటి దారుణాలు కండ్ల ముందే కదులాడుతున్నా లైం గిక దాడులు ఆగడం లేదు. బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలో పెండ్లికి హాజ రైన ఉత్తమ్ సాహు అనే యువకుడు బాలిక (11)పై రాత్రి లైంగికదాడి చేసి, తర్వా త రాయితో చంపాడు. పోలీసులు సాహును అరెస్ట్ చేసి విచారించగా నేరం ఒప్పుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఈటా జిల్లాలో కుటుం బంతో పెండ్లికి హాజరైన బాలిక (9)పై గురువారం రాత్రి పింటు అనే వంట మనిషి.. రేప్ చేసి తర్వాత చంపేశాడు. యమునా ఎక్స్‌ప్రెస్ సమీప కృష్ణానగర్ లో సల్మాన్‌మాలిక్‌కు సురేంద్ర గుర్జర్ అనే స్థిరాస్థి వ్యాపారి ఇచ్చిన రూ.10 లక్షల అప్పు వసూలు కోసం ఒక సీఏ కంపెనీ ఉద్యోగిని వాడుకోవాలని ప్రయత్నించాడు. తన ఇంటికొచ్చిన ఆ యువతిపై సల్మాన్ మాలిక్, స్నేహితుడు లైంగిక దాడి చేశారు.

301

More News

VIRAL NEWS