అది మురికి రాజకీయంTue,November 14, 2017 02:35 AM

సెక్స్ సీడీ లీక్‌పై హార్దిక్ పటేల్ వ్యాఖ్య
hardik patel
న్యూఢిల్లీ, నవంబర్ 13: ఒక మహిళతో తాను సన్నిహితంగా ఉన్నట్లు పేర్కొంటున్న సెక్స్ సీడీ నకిలీదని పాటిదార్ రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు మురికి రాజకీయాలు మొదలయ్యాయి. మీరం తా అభిమానిస్తున్న నన్ను అప్రతిష్ఠ పాల్జేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఇది గుజరాతీ మహిళలను అవమానించడమే అని హార్దిక్ ట్వీట్ చేశారు. ఒక హోటల్ రూమ్‌లో ఒక గుర్తు తెలియని మహిళతో హార్దిక్ పటేల్ ఉన్నట్లు ఆ సీడీలో కనిపిస్తున్నది. ఈ సీడీ యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ కాగానే స్థానిక టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. మీడియా కథనాల ప్రకారం ఈ వీడియోను మే 16న షూట్ చేశారు. దీనిపై హార్దిక్ పటేల్ స్పందిస్తూ ఇది అధికార బీజేపీ మురికి రాజకీయం అని అన్నారు. ఒకవేళ తాను ఆ పని చేస్తే బహిరంగంగా అంగీకరించడానికి వెనుకాడబోనని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తనపై అశ్లీల సీడీ విడుదల చేసే అవకాశం ఉన్నదని ఆయన ముందే ఊహించి చెప్పడం విశేషం. గతంలో సంజయ్ జోషి ఎదుగుతున్నప్పుడు కూడా ఇటువంటి సీడీనే బీజేపీ లీక్ చేసిందని హార్దిక్ చెప్పారు. గుజరాత్‌లో 22 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వనున్నట్లు హార్దిక్ పటేల్ ప్రకటించారు.

540

More News

VIRAL NEWS