చిదంబరానికి మళ్లీ చుక్కెదురు


Sat,September 14, 2019 12:53 AM

Setback to Chidambarams move for early exit from jail court dismisses plea for surrender to ED

- ఈడీ వద్ద లొంగిపోయేందుకు కోర్టు నిరాకరణ

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి మరోసారి చుక్కెదురైంది. మనీల్యాండరింగ్ కేసులో ఈడీ ఎదుట లొంగిపోయేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. సరైన సమయంలో చిదంబరాన్ని అరెస్ట్ చేస్తామని ఈడీ చెప్పగా.. ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్ ఖండించారు. ఆయనను జైలులోనే ఉంచేందుకే ఈడీ ఈ విధంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. చిదంబరాన్ని కస్టడీకి తీసుకునేముందు మరో ఆరుగురిని విచారించాల్సిన అవసరం ఉన్నదన్నారు. దర్యాప్తు సంస్థ ఏంచేయాలో నిందితుడు నిర్దేశించలేరన్నారు. సరైన సమయంలో ఆయనను అరెస్ట్ చేస్తామన్నారు.

98
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles