క్షమాపణ కోరిన జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా

Fri,December 6, 2019 02:39 AM

న్యూఢిల్లీ: తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారిని చేతులు జోడించి క్షమాపణ కోరుతున్నానని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అరుణ్‌మిశ్రా పేర్కొన్నారు. రెండ్రోజుల క్రితం భూసేకరణ కేసు విచారణ సందర్భంగా న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ను ఉద్దేశించి కోర్టు ధిక్కారం కిం ద చర్య తీసుకుంటామని జస్టిస్‌ మిశ్రా హెచ్చరించారు. జస్టిస్‌లు అరుణ్‌ మిశ్రా, ఎంఆర్‌షాతో కూడిన ధర్మాసనం గురువారం సమావేశం కాగానే న్యాయవాదులు కపిల్‌ సిబ ల్‌, ముకుల్‌ రోహత్గీ, ఏఎం సింఘ్వీ, దుష్యంత్‌ దవే, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాకేశ్‌ ఖన్నా మాట్లాడుతూ, తమతో మాట్లాడేటప్పుడు ఓర్పు వహించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు జస్టిస్‌ మిశ్రా స్పందిస్తూ ‘నేను ఎవరినైనా గాయపరిచి ఉంటే, వారిని కేవలం క్షమాపణే కోరడం లేదు..వందసార్లు చేతులు జోడిస్తున్నాను’ అని చెప్పారు.

280
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles