పంజాబ్‌లో ఉగ్రదాడికి కుట్రలు!

Sun,October 13, 2019 02:27 AM

-పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్‌లో హై అలర్ట్.. డ్రోన్ల కదలికలపై నిరంతర నిఘా
గురుదాస్‌పూర్: భారీ ఉగ్రదాడికి కుట్ర జరుగుతుందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంలో ఉండే పంజాబ్‌లోని పఠాన్‌కోట్, గురుదాస్‌పూర్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు వెంబడి పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. శుక్రవారం ప్రారంభమైన ఈ సోదాలు మూడు రోజులపాటు కొనసాగవచ్చని తెలుస్తున్నది. గత నెలలో పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఖలిస్థానీ ఉగ్ర సంస్థ పంజాబ్ సరిహద్దు ప్రాంతాలకు ఎనిమిది డ్రోన్ల ద్వారా సుమారు 80 కిలోల ఆయుధాలు, మందుగుండు సామగ్రిని తరలించినట్లు భద్రతా దళాలు ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. అలాగే జైషే మహ్మద్, లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రవాదులు సరిహద్దులగుండా పంజాబ్‌లోని చొరబడవచ్చని గత నెలలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరించింది.

166
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles