Telangana Intermediate 1st & 2nd Year Results 2019

ఎన్‌ఐఏ కస్టడీలో టీచర్ మృతి


Wed,March 20, 2019 04:00 AM

School teacher dies in police custody

-జమ్ముకశ్మీర్‌లో ఉద్రిక్తత..
-భారీ ఎత్తున నిరసనలు..
-మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించిన గవర్నర్

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం కేసులో అరెస్టయిన ఓ స్కూల్ టీచర్ పోలీసు కస్టడీలో మరణించారు. దీంతో పుల్వామా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. లాకప్ డెత్‌పై రాష్ట్ర ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న అవంతిపురా నివాసి రిజ్వాన్ పండిట్ (28)ను ఉగ్రవాదం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మూడురోజుల క్రితం అరెస్టు చేసింది. విచారణ కోసం అతడిని శ్రీనగర్‌లోని ఎన్‌ఐఏ కార్యాలయంలో ఉంచారు. కాగా సోమవారం అర్థరాత్రి రిజ్వాన్ అనుమానాస్పద రీతిలో మరణించాడని ఓ పోలీస్ అధికారి చెప్పారు. పోలీసు విభాగం విజ్ఞప్తి మేరకు పౌర సేవల విభాగం దీనిపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించిందన్నారు. టీచర్ లాకప్‌డెత్ సంగతి తెలియడంతో అవంతిపురాలో అల్లర్లు చెలరేగాయి.

ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వగా, వారిపై పోలీసులు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు. టీచర్ లాకప్ డెత్‌ను పలువురు రాజకీయ నేతలు ఖండించారు. దీనిపై నిర్ణీత వ్యవధిలోగా ద ర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పారదర్శక దర్యాప్తు జరిపి హంతకులకు కఠిన శిక్ష వేయాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. పీడీపీ-బీజేపీ సంకీర్ణ కూటమి పాలన వల్లే జమ్ముకశ్మీర్‌కు ఈ పరిస్థితి దాపురించిందన్నారు. కేంద్రం అణచివేత విధానాల వల్లే రాష్ట్రంలో అశాంతి రాజ్యమేలుతున్నదని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు.

kashmir

రిజ్వాన్ మృతి బాధాకరం: అసదుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్, నమస్తే కశ్మీర్‌కు చెందిన రిజ్వాన్ పండిట్ పోలీసు కస్టడీలో మృతిచెందడం చాలా బాధాకరమని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ నేను ఈ రోజు ఆయన కుటుంబం కోసం ప్రార్థించాను. రిజ్వాన్ మృతిపై మానవహక్కుల కింద కేసు వేయాలి. ధైర్యంగా, హూందాగా నివసించే హక్కు కశ్మీరీలకూ ఉంది అని పేర్కొన్నారు.

794
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles