అన్యాయమైన తీర్పు న్యాయవ్యవస్థపై మైనార్టీలు

Mon,November 11, 2019 02:09 AM

- విశ్వాసం కోల్పోయేలా ఉంది: జమైత్‌


న్యూఢిల్లీ, నవంబర్‌ 10: అయోధ్యపై అన్యాయమైన తీర్పు ఇచ్చారని జమైత్‌ ఉలేమా ఏ హింద్‌ (జేయూహెచ్‌) ప్రధాన కార్యదర్శి మౌలానా మహ్మద్‌ మదాని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆదివారం ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయవ్యస్థపై మైనార్టీలు విశ్వాసం కోల్పోయేలా తీర్పు ఉన్నదని వ్యాఖ్యానించారు. ‘బాబ్రీ మసీదులో విగ్రహాలు ఉంచడాన్ని, దాన్ని కూల్చడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు చివరకు నేరం చేసిన వారికే ఆ స్థలాన్ని అప్పగించింది. ఓ వర్గానికి వ్యతిరేకంగా విపక్షతో ఇచ్చిన తీర్పులా ఉన్నది. ముస్లింలదే తప్పు అన్నట్లుగా ఇది ఉన్నది’ అని మదాని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచే అక్కడ మసీదు ఉన్నదని, ముస్లింలు ప్రార్థనలు కూడా చేశారని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను హరించేలా ఈ తీర్పు ఉన్నదని, ముస్లింల హక్కులకు రక్షణ కల్పించడంలో కోర్టు విఫలమైందని వ్యాఖ్యానించారు.

287
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles