గోద్రా కేసులో మోదీకి క్లీన్‌చిట్‌పై జులైలో సుప్రీం విచారణ


Tue,February 12, 2019 12:33 AM

SC to hear Zakia Jafris plea against clean chit to Narendra Modi in Gujarat riots in July

న్యూఢిల్లీ: గోద్రా అల్లర్ల కేసులో నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీకి సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని సవాలుచేస్తూ ఆ అల్లర్లలో దారుణ హత్యకు గురైన మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై జులైలో విచారణ జరుపనున్నట్టు సుప్రీంకోర్టు సోమవారం వెల్లడించింది. గోద్రా అల్లర్ల వ్యవహారంలో మోదీ, సీనియర్ ప్రభుత్వాధికారులు సహా 63 మందిపై విచారణకు తగిన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ సిట్ 2012 ఫిబ్రవరి 8న ముగింపు నివేదికను దాఖలు చేసింది. సిట్ నిర్ణయానికి వ్యతిరేకంగా జాకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను 2017 అక్టోబర్ 5న గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

130
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles