సీబీఐ విచారణకు ఆదేశించలేం


Tue,September 18, 2018 01:40 AM

SC refused CBI probe of attacks on Swami Agnivesh

-మీపై దాడుల విషయమై హైకోర్టుకు వెళ్లండి
-స్వామి అగ్నివేశ్‌కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ఇటీవల తనపై జరుగుతున్న వరుస దాడులపై సీబీఐతో విచారణకు ఆదేశించాలన్న సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ వినతిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ దాడులపై ఇప్పటికే ఆయా రాష్ర్టాల పోలీసులు దర్యాప్తు చేస్తున్న దశలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. ఈ మేరకు జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ కేసుపై విచారణ జరిపింది. జూలై 17న జార్ఖండ్‌లోని పాకూర్‌లో, ఆగస్టు 18న ఢిల్లీలో మీపై జరిగిన దాడులకు సంబంధించి సీబీఐ విచారణ కోసం మీరు ఆయా హైకోర్టులకు వెళ్లండి. మీ భద్రతపై ఆందోళన ఉంటే సంబంధిత విభాగానికి దరఖాస్తు చేసుకోండి అని ధర్మాసనం సూచించింది.

436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles