పెరుగుతున్న ఉప్పు ముప్పు


Mon,April 16, 2018 02:18 AM

Salt poisonous effect is growing threat to crops

-25-30 ఏండ్ల మధ్యవారిలో ఆందోళనకరంగా కిడ్నీ ఫెయిల్యూర్స్
-ఉప్పు వాడకం తగ్గించడమే మార్గమంటున్న నిపుణులు

Salt
ముంబై: యుక్త వయసులో మూత్రపిండ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య దేశంలో పెరిగిపోతున్నది. ముఖ్యంగా డయాలసిస్ చేయించుకుంటున్నవారిలో 25-30 ఏండ్ల మధ్య వయసువారి సంఖ్య ఆందోళనకరంగా పెరిగిపోతు న్నదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఉప్పు వాడకాన్ని తగ్గించాలని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా వంటింటి బాధ్యతలు చూసే మహిళలు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని, కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణం అవుతున్న మొదటి ఐదు అంశాల్లో మూత్రపిండాలు చెడిపోవడం కూడా ఒకటి. కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేయించుకుంటున్న రోగుల్లో ఇటీవల 25-30 ఏండ్ల మధ్య వయసు వారు ఎక్కువవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. దీనికి రక్తపోటు పెరుగడమే ప్రధాన కారణమని, శరీరంలోకి ఉప్పును ఎక్కువగా తీసుకుంటుండటంతో హైపర్‌టెన్షన్‌కు దారి తీస్తున్నదని ముంబైకి చెందిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అరుణ్ పీ దోషి పేర్కొన్నారు. గత ఐదారేండ్లుగా ఈ పరిస్థితి పెరుగుతున్నదని చెప్పారు. ఉప్పు వాడకాన్ని నియంత్రించగలిగితే హైపర్‌టెన్షన్ తగ్గుతుందని, తద్వారా కిడ్నీలు చెడిపోకుండా కాపాడవచ్చని వివరించారు.

2492
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS