శబరిమలపై ఆరెస్సెస్ మాట మార్చింది


Fri,October 12, 2018 01:34 AM

RSS Changes Stance on Womens Entry in Sabarimala Slams Kerala Govt for Implementing SC Verdict

- మహిళలందరినీ అనుమతించాలని సుప్రీంకోర్టులో తొలుత ఆ సంస్థే పిటిషన్ వేసింది
- ఇప్పుడు మాట మార్చుతున్నది
-కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ వెల్లడి

కొచ్చి: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలోనికి అన్ని వయస్సుల మహిళలను అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ రాష్ట్రీయ స్వయమ్ సేవక్ సంఘ్(ఆరెస్సెస్)కు చెందిన కరుడుగట్టిన నాయకులు 2006లోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ చెప్పారు. కానీ, ప్రస్తుతం మహిళ ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతిస్తే గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. అప్పుడు అనుమతించాలంటూ కోరిన ఆరెస్సెస్ నాయకులు ఇప్పుడు వ్యతిరేకించడం ఆశ్చర్యంగా ఉన్నదని తెలిపారు. సుప్రీంకోర్టు ప్రస్తుతం ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం.. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలంటూ పలువురు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గురువారం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ శబరిమలను కాపాడుకుందాం అనే నినాదంతో బీజేపీకి చెందిన కొందరు నాయకులు బుధవారం యాత్ర నిర్వహించారని, ఈ యాత్రను చూస్తే తనకు అయోధ్య రామమందిరం నిర్మాణానికి ఆ పార్టీ గతంలో చేపట్టిన రథయాత్ర గుర్తుకువస్తున్నదని చెప్పారు. మరోవైపు మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ అనుబంధ విభాగం యువమోర్చా నాయకులు ఆయన ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించారు. పోలీసులు నీటి గొట్టాలతో ఆందోళనకారులను చెదరగొట్టారు.

1065
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles