మాయావతి సోదరుడి ఆస్తులు 1,300 కోట్లు!

Wed,January 11, 2017 01:37 AM

న్యూఢిల్లీ, జనవరి 10: భారత టాప్ టెన్ పారిశ్రామికవేత్తల జాబితాలో ఆయన పేరు లేదు. దేశంలో ఆయన అంతగా పేరుగాంచిన వ్యక్తీ కాదు. కానీ, ఆయన ఆస్తులు ఏడేండ్లలో రూ.7.5 కోట్ల నుంచి రూ.1,316 కోట్లకు పెరిగాయి.
KUMAR
ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధినేత్రి మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్న 2007-2014 కాలంలో ఆమె సోదరుడు ఆనంద్‌కుమార్ ఆస్తులు పెరిగిన తీరు ఇది. దీంతో ఆయన ఆర్థికలావాదేవీలపై ఆదాయం పన్ను (ఐటీ) శాఖ నిఘా పెట్టింది. బూటకపు కంపెనీలు, భారీగా రుణాలు, పెద్దఎత్తున రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ముసుగులో భారీగా ఆనంద్‌కుమార్ ఆస్తులు కూడబెట్టినట్టు ఐటీ గుర్తించిందని, వాటిపై విచారణ జరుపుతున్నదని, దీనికి సంబంధించిన పత్రాలను టైమ్స్ నౌ పత్రిక సంపాదించింది. ఆకృతి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన కేసునే తొలుత విచారణకు ఐటీ స్వీకరించింది. బూటకపు కంపెనీలు, అక్రమ ఆర్థిక వ్యవహారాలపై సంబంధిత శాఖలు విచారణ జరుపుతున్నట్టు ప్రభుత్వవర్గాలు వెల్లడించినట్టు టైమ్స్ నౌ పత్రిక కథనం ప్రచురించింది.

314

More News

మరిన్ని వార్తలు...