కేరళ లో మరో విపత్తు?


Thu,September 13, 2018 12:31 AM

Rivers wells dry up in flood hit Kerala govt orders study

-నదులు, బావుల్లో తగ్గిపోతున్న నీటి మట్టాలు
తిరువనంతపురం, సెప్టెంబర్ 12: కేరళను అతలాకుతలం చేసిన వరదలతో అక్కడి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, నదులు, బావుల్లో నీళ్లు ఎండిపోతుండటం, భూగర్భ జలాలు అడుగంటిపోతుండటం జరుగుతున్నది. వర్షాలు కురిసినప్పుడు ఉప్పొంగి ప్రవహించిన నదులు ప్రస్తుతం రోజురోజుకు అడుగంటిపోతుండటం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. బావుల్లో నీళ్లు కూడా తగ్గిపోతుండటం, భూగర్భ జలాలు అడుగంటిపోతుండటం అంతుచిక్కని విషయంగా మారింది. అలాగే కేరళలోని చాలా ప్రాంతాల్లో భూమి పగుళ్లు రావడంతోపాటు పొడిగా మారింది. ప్రకృతి నిలయమైన కేరళను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తడంతో పర్యావరణం, జీవవైవిధ్యం దెబ్బతిన్నది. ఈ పరిణామాలతో వాతావరణంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే నదులు, బావులు ఎండిపోవడం, భూమి పగుళ్లు రావడం తదితర సమస్యలు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

371
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles