మా ఆలయానికి ఇప్పుడు రావొద్దు!


Sun,May 19, 2019 02:26 AM

Reeling Under Drought This Dakshin Kannada Temple Doesn Want Pilgrims to Visit it

-నీటి ఎద్దడి కారణంగా ధర్మస్థల ఆలయ యాజమాన్యం విజ్ఞప్తి
ధర్మస్థల: కర్ణాటకలో నీటి కరవు తీవ్ర రూపం దాల్చింది. నీటి ఎద్దడితో దక్షిణ కన్నడలోని ప్రముఖ ఆలయం ధర్మస్థల పుణ్యక్షేత్రానికి భక్తులు ఈ నెలాఖరుదాకా రావొద్దని ఆలయ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలోని మొత్తం 176 తాలూకాల్లో 156 తాలూకాలు నీటి కరువుతో అల్లాడుతున్నాయి. దక్షిణ కన్నడ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చే నేత్రావతి నదిలో నీటి నిల్వలు తగ్గడంతో జిల్లాలో నీటి ఎద్దటి ఏర్పడింది. దీంతో అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు ధర్మస్థల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు తమ సందర్శనను ఈ నెలాఖరు వరకు వాయిదా వేసుకోవాలని ధర్మస్థల శ్రీ మంజునాథేశ్వర ఆలయ అధికారి డా. వీరేంద్ర హెగ్డే కోరారు. నేత్రావతి నదిలో నీటి నిల్వలు భారీగా తగ్గిపోవడంతో దక్షిణ కన్నడ జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్నది. ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికి 2, 3 రోజులకొకసారి రేషన్ దుకాణాల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నాం. ఈ సమయంలో భక్తులు ధర్మస్థల ఆలయ దర్శనానికి వస్తే, నీటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి, వాళ్ళు తమ ప్రయాణాల్ని నెలాఖరు వరకు వాయిదా వేసుకుంటే మంచిది అని తెలిపారు.

632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles