అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం!


Sat,April 20, 2019 02:16 AM

Ready to face assembly polls in Tamil Nadu says Rajinikanth

-తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రకటన
చెన్నై, ఏప్రిల్ 19: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాను పోటీకి సిద్దమని తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్దమేనని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. మే 23న తెలుస్తుందంటూ సమాధానమిచ్చారు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు 2017 డిసెంబర్‌లో ప్రకటించిన రజినీకాంత్.. 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు పోటీ చేస్తామని కూడా ఇదివరకే తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులో 22 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నందున మే 23న వెలువడే ఫలితాలపైనే అన్నాడీఎంకే ప్రభుత్వం సుస్థిరత ఆధారపడి ఉన్నది. గురువారం జరిగిన రెండో దశ లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని 38 లోక్‌సభ స్థానాలతో పాటు 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పోలింగ్ జరిగింది. మిగతా నాలుగు అసెంబ్లీ స్థానాలకు మే 19న ఉపఎన్నికలు జరుగనున్నాయి.

153
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles