నాన్నా! రబ్రీదేవికి క్షమాపణ చెప్పు


Sun,January 13, 2019 02:06 AM

Ram Vilas Paswans daughter demands apology for his remarks on un educated women

-లేకుంటే మీ పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేస్తా
-పాశ్వాన్ కుమార్తె ఆశా పాశ్వాన్ హెచ్చరిక

పాట్నా: అగ్రకుల రిజర్వేషన్లకు సంబంధించిన వివాదంలో బీహార్ మాజీ సీఎం రబ్రీదేవిని అవమానించేలా మాట్లాడిన కేంద్రమంత్రి, లోక్‌జన్‌శక్తి (ఎల్జేపీ) అధినేత రాం విలాస్ పాశ్వాన్‌కు ఆయన సొంత కుమార్తె నుంచే ప్రతిఘటన ఎదురైంది. రబ్రీదేవికి క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ఎల్జేపీ కార్యాలయం ముందు ధర్నా చేస్తానని ఆశా పాశ్వాన్ తన తండ్రి రాం విలాస్ పాశ్వాన్‌ను హెచ్చరించారు. అగ్ర కులాల పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని ఆర్జేడీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో శుక్రవారం రాం విలాస్ పాశ్వాన్ స్పందిస్తూ వారికి (ఆర్జేడీ నాయకులకు) కేవలం నినాదాలు చేయడం, వేలు ముద్ర వేసే వాళ్లను ముఖ్యమంత్రులను చేయడం తప్ప ఇంకేమీ తెలియదు అని వ్యాఖ్యానించారు. ఆయన ఎవరి పేరును ప్రస్తావించనప్పటికీ రబ్రీదేవిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తున్నది. దీనిపై ఆశా శనివారం విలేకరులతో మాట్లాడుతూ నాన్నా.. రబ్రీదేవిని అవమానించావు. మా అమ్మకు కూడా చదువురాదు. మా అమ్మను ఎందుకు విడిచిపెట్టావు? నీ వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పు. లేకుంటే ఎల్జేపీ కార్యాలయం ముందు ధర్నా చేస్తా అని పేర్కొన్నారు. పాశ్వాన్ మొదటి భార్య రాజ్ కుమారి దేవి కూతురే ఆశ. చాలా కాలంగా రాజ్‌కుమారి దేవికి దూరంగా ఉంటున్న పాశ్వాన్.. రీనా అనే మరో మహిళను పెండ్లి చేసుకున్నారు.

1133
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles