ప్రజాతీర్పును రాజీవ్ ఎన్నడూ దుర్వినియోగపర్చలేదు


Fri,August 23, 2019 03:52 AM

Rajiv never used mandate to scare people says Sonia Gandhi

1984లో భారీ మెజార్టీ వచ్చినా కూడా ఆ పని చేయలేదు: సోనియా
న్యూఢిలీ: మాజీ ప్రధాని, దివంగత రాజీవ్‌గాంధీ 1984లో బ్రహ్మాండమైన ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చారని, కానీ ఆయన ఆ తీర్పును సమాజంలో భయాందోళన వాతావరణం సృష్టించడానికి, బెదిరించడానికి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను నిర్వీర్యం చేయడానికి ఉపయోగించలేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చెప్పారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి అధికారం చేపట్టడం.. బుధవారం కాంగ్రెస్ నేత చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేయడాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తున్నది. రాజీవ్‌గాంధీ 75వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్‌కు మెజారిటీ రాలేదని, అయినప్పటికీ అప్పట్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించిందని చెప్పారు. మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమున్నప్పటికీ రాజీవ్‌గాంధీ అలా చేయలేదని, దీనికి ఆయన అంతరాత్మ అంగీకరించకపోవడమే కారణమని పేర్కొన్నారు.

ఆ ఒప్పందాలతో దేశసమైక్యత పటిష్ఠం: రాహుల్

రాజీవ్‌గాంధీ పాలనలో పంజాబ్, అసోం, మిజోరంలతో నాడు చేసుకున్న ఒప్పందాలు దేశ ఐక్యతను పటిష్ఠం చేశాయని ఆయన కుమారుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.

404
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles