పెహ్లూఖాన్ హత్య కేసులో అంతా నిర్దోషులే


Thu,August 15, 2019 12:59 AM

Rajasthan govt to appeal against lower court verdict in Pehlu Khan lynching case

- తీర్పునిచ్చిన అల్వార్ స్థానిక కోర్టు
- పై కోర్టులో సవాల్ చేస్తామన్న రాజస్థాన్ ప్రభుత్వం


జైపూర్, ఆగస్టు 14: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెహ్లూఖాన్ హత్య కేసులో మొత్తం ఆరుగురు నిందితులను రాజస్థాన్‌లోని అల్వార్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కోర్టు తీర్పును పై న్యాయస్థానంలో సవాల్ చేయనున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం తెలిపింది. 2017 ఏప్రిల్‌లో పెహ్లూఖాన్ (55), ఆయన ఇద్దరు కుమారులు, మరి కొందరు కలిసి ఆవులను తీసుకెళ్తుండగా అల్వార్ జిల్లాలోని బెహ్రూర్ సమీపంలో కొందరు అడ్డగించారు. పెహ్లూఖాన్‌ను బలంగా కొట్టడంతో ఆయన చనిపోయారు. గోసంరక్షణ పేరుతో జరుగుతున్న ఇలాంటి దాడులను పలువురు ఖండించారు. మూకదాడికి సంబంధించి ఆరుగురు నిందితులపై పోలీసులుకేసు నమోదు చేయగా బుధవారం స్థానిక కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది. మరోవైపు కోర్టు తీర్పుపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ నిందితులకు శిక్ష పడేలా చూడటం ప్రభుత్వం బాధ్యత. కానీ ప్రభుత్వం సరిగా వాదనలు వినిపించలేదు. అందుకే కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును ప్రభుత్వం వెంటనే పై కోర్టులో అప్పీల్ చేయాలి అని ట్వీట్ చేశారు.

115
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles