కాంగ్రెస్ రెండో జాబితాలో రాజ్‌బబ్బర్, ప్రియాదత్


Fri,March 15, 2019 11:26 AM

Raj Babbar Sriprakash Jaiswal and Priya Dutt in Congress 2nd Lok Sabha candidates

న్యూఢిల్లీ, మార్చి 13: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో ఆ పార్టీ ఉత్తర్‌ప్రదేశ్ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్ (మొరాదాబాద్), కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ (కాన్పూర్), మాజీ హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే (షోలాపూర్), ప్రియాదత్ (ముంబై-నార్త్ సెంట్రల్) తదితరులు ఉన్నారు. 21 మంది అభ్యర్థుల పేర్లతో విడుదల చేసిన రెండో జాబితాలో 16 మంది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారు కాగా, ఐదుగురు మహారాష్ట్ర అభ్యర్థులు ఉన్నారు. కిసాన్ కాంగ్రెస్ నాయకుడు నాగ్‌పూర్ నుంచి, మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరా దక్షిణ ముంబై, సంజయ్ సింగ్ సుల్తాన్‌పూర్ నుంచి పోటీ చేయనున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌పార్టీ యూపీలో పోటీచేయనున్న 27 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

169
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles