కండ్లలో తుఫాన్.. సమస్యల్లో జనం..Tue,November 14, 2017 12:41 AM

-అయినా ఆయన మాట్లాడరు!!
-ప్రధాని మోదీపై ట్విట్టర్‌లో రాహుల్ సెటైర్లు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యంగ్య భాషను ఉపయోగిస్తూ ప్రధాని మోదీ పేరెత్తకుండానే ఆయనపై సునిశిత విమర్శలు ఎక్కుపెడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన కాలుష్యం బారిన పడిన ప్రస్తుత నేపథ్యంలో 1978లో నగర జీవనంపై వచ్చిన హిందీ సినిమా గమన్‌లోని ఓ పాటను ట్విట్టర్‌లో పోస్ట్ సీనే మే జలన్.. ఆంఖోమే తుఫాన్‌సా క్యూ హై.. ఇస్ షెహర్ మే.. హర్ షక్స్.. పరేషాన్‌సా క్యూ హై.. (ఛాతీలో నొప్పి.. కండ్లలో తుఫాన్.. నగరంలో ఉన్న ప్రజలంతా ఎందుకు తీవ్ర సమస్యల్లో ఉన్నారు) అనే పంక్తులను ఉటంకిస్తూ ఢిల్లీలో పరిస్థితిని వివరించారు. దీంతోపాటు క్యా బతాయేంగే సాహెబ్, సబ్ జాన్‌కార్ అన్‌జాన్ క్యూ హై (అన్నీ తెలిసి మాట్లాడకుండా ఉంటున్న మీరు, దీని గురించి చెప్పండి) అంటూ ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ పరోక్ష విమర్శలు చేశారు. గుజరాత్‌లో ఆలయాలను దర్శిస్తున్న రాహుల్ మీడియాతో మాట్లాడుతూ తాను శివభక్తుడినని, అందుకే మందిరాలు దర్శిస్తున్నానని చెప్పారు.

158

More News

VIRAL NEWS