మేఘాలు, మామిడికాయలు కాదు..సమస్యలపై మాట్లాడండి


Wed,May 15, 2019 01:47 AM

Rahul Gandhis Rain and Radar Dig At PM Modi After Balakot Comments

- ఐదేండ్లలో నిరుద్యోగ యువతకు ఏం చేశారు?.. ప్రధానికి రాహుల్ ప్రశ్న
- తమ కుటుంబాన్ని మోదీ అవమానించినా.. ఆయన కుటుంబం గురించి తానెన్నడూ చెడుగా మాట్లాడనని వ్యాఖ్య


ఉజ్జయిని/న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో తన తండ్రిని, నాయనమ్మను అవమానించినా, తాను మాత్రం ఆయన తల్లిదండ్రుల గురించి ఎన్నటికీ చెడు గా మాట్లాడనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. నేను చచ్చినా ఆయన తల్లిదండ్రులను అవమానించను. ఎందుకంటే నేను ఆరెస్సెస్, బీజేపీ వ్యక్తిని కాను. కాంగ్రెస్ వాదిని. ఆయన నాపై విద్వేషాన్ని విరజిమ్మినా.. నేను మాత్రం ప్రేమనే తిరిగిస్తాను అని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబసభ్యుల పంట రుణాలను కూడా తాము మాఫీ చేశామని, కానీ ఆయన మాత్రం రైతు రుణాలు మాఫీ చేయలేదంటున్నారని విమర్శించారు. రాజకీయా ల్లో కొత్త భాష కోసం రాహుల్ పిలుపునిచ్చా రు. సమస్యలు, సిద్ధాంతాలపై ఎంతగా పోట్లాడుకున్నా, ఒకరిపై ఒకరు విద్వేషం, హింసకు పాల్పడకూడదని ఆయన ట్వీట్ చేశారు.

వర్షమొస్తే విమానాలు రాడార్లకు చిక్కవా?

బాలాకోట్ దాడుల సమయంలో పాక్ రాడార్ల నుంచి మన యుద్ధవిమానాలు తప్పించుకోవడానికి మేఘాలు సాయపడ్డాయని ప్రధానిమోదీ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. మోదీజీ.. దేశంలో వర్షం పడ్డప్పుడు.. రాడార్ల నుంచి అన్ని విమానాలు మాయమవుతాయా అని ప్రశ్నించారు. బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు మామిడిపండ్లు అంటే ఇష్టమని మోదీ పేర్కొన్న సంగతినీ రాహుల్ ప్రస్తావించారు. మోదీజీ.. మామిడిపండ్లు ఎలా తినాలో మాకు చెప్పారు. అయితే దేశంలోని నిరుద్యోగ యువతకు మీరేం చేశారో దేశ ప్రజలకు చెప్పండి అని డిమాండ్ చేశారు. మేఘాలు, మామిడి కాయల గురించి మాట్లాడుతున్న మోదీ.. ముఖ్యమైన సమస్యల గురించి మాట్లాడడం లేదని విమర్శించారు.

250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles