మహిళను అడ్డం పెట్టుకున్నారు


Thu,January 10, 2019 02:53 AM

Rahul Gandhi says PM Modi asked a woman for his rescue on Rafale

-రాఫెల్‌పై చర్చలో మోదీ సమాధానం చెప్పలేక నిర్మలా సీతారామన్‌ను తీసుకొచ్చారు
-నా ప్రశ్నలకు ఆమె నుంచి జవాబులే రాలేదు
-కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశమంతా రుణాల మాఫీ
-రాజస్థాన్ రైతు సభలో రాహుల్ గాంధీ ప్రకటన

జైపూర్: రాఫెల్ ఒప్పందంపై లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొనకుండా మోదీ పారిపోయారని, తనను కాపాడాలని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ముందుకు తెచ్చారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అవినీతిని అనుమతించబోనని, చౌకీదార్‌లా దేశానికి కాపలా కాస్తానని చెప్పిన మోదీ లోక్‌సభలో రాఫెల్ ఒప్పందంపై చర్చ జరిగినప్పుడు కనీసం ఒక్క నిమిషం కూడా లేచి నిలబడలేకపోయారన్నారు. ఈ అంశంపై చర్చ సందర్భంగా నేను ప్రశ్నలు అడిగినప్పుడు 56 అంగుళాల ఛాతీ ఉన్న చౌకీదారు అక్కడినుంచి పారిపోయారు. తనను తాను సమర్థించు కోలేకపోతున్నానని, ఆ పని చేయాలని ఒక మహిళను (రక్షణమంత్రి సీతారామన్‌ను) కోరుకున్నారు. 2.30 గంటలు జరిగిన చర్చలో ఆమె మోదీని సమర్థించలేకపోయారు. అవినీతి జరిగిన మాట వాస్తవమా? కాదా? అని అడిగిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పలేక పోయారు అని రాహుల్ అన్నారు.

వ్యవసాయ సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఇటీవల రాజస్థాన్ సహా మూడు రాష్ర్టాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించి తమ శక్తి ఏమిటో ప్రధాని మోదీకి చూపారని అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు రాజస్థాన్‌లో ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్ జైపూర్‌లో బుధవారం రైతుల సభలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ ఎప్పుడూ బ్యాక్‌ఫుట్‌లో ఆడుతున్నారు. ఫ్రంట్‌ఫుట్‌లో ఆడి సిక్సర్ కొట్టాలని దేశ యువతను కోరుతున్నా అని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశమంతటా పంట రుణాల మాఫీ చేస్తామని రాహుల్ ప్రకటించారు.

543
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles