అంబానీ దోపిడీకి ద్వారాలు తెరిచారు


Tue,February 12, 2019 02:25 AM

Rahul Gandhi renews Rafale attack says PM opened doors for Anil Ambani

- రాఫెల్ ఒప్పందంపై విరుచుకుపడిన రాహుల్
న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంలో అవినీతి నిరోధకతకు సంబంధించిన ఒక నిబంధనను తొలిగించడం ద్వారా ప్రధాని మోదీ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి దోచుకొనేందుకు ద్వారాలు తెరిచారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత వైమానిక దళం నుంచి రూ.30వేల కోట్లను దోచుకొనేలా అంబానీ కోసం ప్రధాని మోదీ ద్వారాలు తెరిచి ఉంచారని దుయ్యబట్టారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వైమానిక దళం నుంచి రూ.30వేల కోట్లు దోచుకోమని చౌకీదార్ (కాపలాదారు) స్వయంగా అనిల్ అంబానీకి ద్వారాలు తెరిచారు అని రాహుల్ ట్వీట్ చేశారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రతినిధి మనీశ్ తివారీ విలేకరులతో మాట్లాడుతూ, రాఫెల్ ఒప్పందంలో అవినీతి చోటుచేసుకుందని, అందుకే అవినీతిని నిరోధించే ఆ నిబంధనను తొలిగించారని ఆరోపించారు. లోక్‌పాల్ చట్టాన్ని అమలు చేసి ఉంటే రాఫెల్ అంశంలో ప్రధాని మోదీ మొదటి నిందితునిగా ఉండేవారని కాంగ్రెస్ లోక్‌సభలో పేర్కొంది. రాఫెల్ విషయంలో తప్పు చేసినవారెవరైనా ఉంటే అది ప్రధాని మాత్రమేనని కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ ఆరోపించారు. ఈ కుంభకోణం నుంచి మోదీ ఇప్పుడు తప్పించుకున్నా.. భవిష్యత్‌లో ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కాగ్ నివేదికలో రాఫెల్ ఒప్పందంలోని లొసుగులను బయటపెట్టకపోతే.. ఆ నివేదికకు విలువ ఉండదని కాంగ్రెస్ పేర్కొంది. రాఫెల్ ఒప్పందం ప్రభుత్వ లొసుగులను బయటపెట్టిందని తృణమూల్ ఎంపీ సౌగతారాయ్ పేర్కొన్నారు. చౌకీదార్ కోసం దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడరాదని బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. రాఫెల్ పై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని సీపీఎం డిమాండ్ చేసింది.

154
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles