మేం న్యాయం చేస్తాం

Wed,April 24, 2019 09:41 AM

ఏడాదిలో 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: రాహుల్ గాంధీ
దుంగార్పూర్, ఏప్రిల్ 23: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే పేదరికంపై లక్షిత (సర్జికల్ ైస్ట్రెక్స్) దాడులు చేయడంతోపాటు ఏడాది లోపు 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. పంచాయతీల స్థాయిలో పది లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. మంగళవారం ఆయన రాజస్థాన్‌లోని దుంగార్పూర్ లోక్‌సభా స్థానం పరిధిలోని బెనేశ్వర్ ధామ్‌లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ గత ఐదేండ్లలో పేదలకు అన్యాయం చేశారు. 15-20 మంది సంపన్నుల కోసమే పని చేశారు. బీజేపీ గత ఐదేండ్లలో అన్యాయం చేసింది. వచ్చే ఐదేండ్లలో మేం న్యాయం చేస్తాం అని చెప్పారు.

464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles