రాహుల్‌పై విచారణ షురూ!


Wed,June 13, 2018 07:30 AM

Rahul Gandhi pleads not guilty in defamation case filed by RSS

-ఆర్‌ఎస్‌ఎస్ పరువునష్టం కేసులో భీవండి సివిల్ కోర్టులో హాజరు
- అభియోగాలు నమోదు
rahul-in-court
థానే: ఆరెస్సెస్ కార్యకర్త దాఖలు చేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మహారాష్ట్ర భీవండి సివిల్ జడ్జి ఎదుట మంగళవారం విచారణకు హాజరయ్యారు. ఆయన త నకు వ్యతిరేకంగా దాఖలైన అభియోగాలను అంగీకరించడపోవడంతో కేసు వి చారణ కొనసాగుతుందని కోర్టు తెలి పింది. 2014లో ఒక ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ప్రసంగిస్తూ మహాత్మాగాంధీ హత్య వెనుక ఆరెస్సెస్ హస్తమున్నదని ఆరోపించారు. దీంతో రాజే కుంటే అనే ఆరెస్సెస్ కార్యకర్త రాహుల్‌పై పరువునష్టం కేసు దాఖలు చేశా రు. మంగళవారం రాహుల్‌కు వ్యతిరేకంగా దాఖలైన చార్జిషీట్‌ను చదివి వినిపించిన న్యాయమూర్తి.. ఈ నే రాన్ని మీరు అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. నేను అంగీకరించను అని రాహుల్‌గాంధీ సమాధాన మిచ్చారు. దీంతో ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కోర్టు రాహుల్‌పై అభియోగాలను నమోదు చేసింది. తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 10వ తేదీకి వాయిదా వేసింది. విచారణ తర్వాత రాహుల్‌గాంధీ మాట్లాడు తూ అవసరమైతే నేను మళ్లీ విచారణకు హాజరవుతా.

నాకు వ్యతిరేకంగా వారు (ఆరెస్సెస్, బీజేపీ) ఎన్ని కేసులైనా పెట్టికోనివ్వండి. మాది సైద్ధాంతిక పోరాటం. అంతిమ విజయం మాదే అని అన్నారు. రాహుల్‌గాంధీ భారీ భద్రత మధ్య మంగళవారం ఉదయం 11.05 గంటలకు కోర్టుకొచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ అనుకూల నినాదాలతో హోరెత్తించారు. ఈ సంద ర్భంగా ముంబై కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రధాని మోదీని ప్రశ్నించారు. బీజేపీ కురువృద్ధ నేతలు వాజపేయి, అద్వానీలను ప్రధాని మోదీ తీవ్రంగా అవమానిస్తున్నారని రాహుల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మాజీ ప్రధాని వాజపేయిని దవాఖానలో తొలుత పరామర్శించింది తానేనన్నారు.

659

More News

VIRAL NEWS