సీనియర్ నేతలతో రాహుల్ మంతనాలుWed,January 11, 2017 01:42 AM

న్యూఢిల్లీ, జనవరి 10: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ 11 రోజుల విదేశీ విహారయాత్ర ముగించుకుని వచ్చి మంగళవారం పార్టీ విధులకు హాజరయ్యారు. ఐదురాష్ర్టాల ఎన్నికలకు పార్టీ సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఇలా యాత్రలు జరుపడం ఏమిటని విమర్శలు వినవస్తున్నాయి. త్వరలో పార్టీ ప్రతినిధివర్గంతో కలిసి ఆయన చైనా వెళ్లాల్సి ఉంది.
rahulgandhi
విదేశాల నుంచి తిరిగివచ్చిన రాహుల్ తన నివాసంలో ఉన్నతస్థాయి పార్టీ సమావేశం నిర్వహించారు. పంజాబ్ ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో పెండింగులో ఉన్న 40 సీట్లపై సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన దరిమిలా బీజేపీ-అకాలీదళ్, ఆప్ అభ్యర్థులను ఖరారు చేశాయి. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా అసంపూర్ణంగా ఉండిపోయింది. దీనితోపాటుగా నవజ్యోత్‌సింగ్‌సిద్ధూ డిమాండ్లపై కూడా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. ఈ సమావేశానికి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. సమావేశం తర్వాత తల్లి సోనియాతో కారులో నివాసం బయటికొచ్చిన రాహుల్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. బహుశా తన విదేశీ పర్యటన గురించి సమాధానం చెప్పాల్సి వస్తుందని ముఖం చాటేశారని అంటున్నారు.

489
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS