నోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణం


Tue,September 18, 2018 01:41 AM

Rahul Gandhi Addresses Party Workers In Madhya Pradesh

-మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రాహుల్
-భోపాల్ నుంచి 15 కి.మీ పొడవున మెగా రోడ్‌షో నిర్వహణ

భోపాల్: పెద్ద నోట్ల రద్దు అనేది అతిపెద్ద కుంభకోణం అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. నల్లధనాన్ని వైట్‌గా మార్చుకునేందుకే పెద్ద నోట్లను మోదీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్‌లో సోమవారం ఆయన 15 కి.మీ. రోడ్‌షోతో ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకుముందు దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నాలుగు గంటల పాటు సాగిన రోడ్ షోలో రాహుల్‌ను తిలకించి ఫోన్లలో బంధించేందుకు వేలాది మంది స్థానికులు రోడ్లపై బారులు తీరారు. రోడ్ షో పొడవునా రోడ్డుకు ఇరువైపులా రాహుల్‌గాంధీని శివభక్తుడిగా పేర్కొంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్, ప్రచారకమిటీ చైర్మన్ జ్యోతిరాదిత్య సింధియాలతోపాటు ఇతర సీనియర్ నేతలతో కలిసి రాహుల్ రోడ్‌షోలో పాల్గొన్నారు.

277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS